ఇటు బుల్లితెరపై యాంకర్‌గా, వివిధ షోలలో రాణిస్తూనే అటు సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందుకుంటోంది హరితేజ. బిగ్‌బాస్ తర్వాత హరితేజ దూకుడు పెంచిందనే చెప్పాలి. గతంలో ‘అ..ఆ’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘రాజా ది గ్రేట్’ వంటి చిత్రాల్లో నటిస్తూ జోరును కొనసాగిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలలో కూడా నటిస్తోంది.
ఇక విషయానికొస్తే తాజాగా హరితేజ తన ఫ్యామిలీతో పాటు ‘మహానటి’ సినిమాకు థియేటర్‌కు వెళ్లిన హరితేజకు ఉహించని పరిణామంతో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ హాఫ్ లో తన చెల్లి పక్కన కూర్చొని సినిమా చూసిన హరితేజ, సెకండాఫ్ తర్వాత తన తల్లి పక్కన కూర్చోని సినిమా చూడాలనుకుంది. అక్కడి నుంచి లేచి తన తల్లి వైపు వెళుతుంటే ఓ మహిళా అభ్యంతరం వ్యక్తం చేసిందట.
ఇప్పుడు కూర్చున్నట్లే కూర్చో అమ్మా..లేకపోతే మా అమ్మాయి మీ నాన్న పక్కన కూర్చునేందుకు ఇబ్బందిగా ఫీలవుతుందని అభ్యంతరం చేసిందట. దీంతో హరితేజ ‘తప్పేంటి ఆంటీ.. తండ్రే కదా’ అనటంతో గొడవ ఎందుకులే అనుకుని హరితేజ వాళ్ల నాన్న లేచి ఇటు వస్తుంటే ఆమె ఓ మాట అన్నారట. ‘మీరేమమ్మా సినిమా వాళ్లు ఎవరి పక్కనైనా కూర్చుంటారు. అని అన్న మాటతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారట. దీంతో వీడియో ద్వారా చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు హరితేజ.