డ్రగ్స్ వైపు మళ్లిన నాయనతార..

258
Nayanthara's character in 'Kolamavu Kokila
- Advertisement -

నయనతార..మూడు పదుల వయస్సు దాటిన చెక్కుచెదరని అందంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. దక్షిణాది సినీ పరిశ్రమలో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇటు హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెండ్ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళంలో ఓ డిఫరెంట్ సినిమాతో మనముందుకొస్తుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో నటించిందట నమనతార.

Nayanthara's character in 'Kolamavu Kokila

తమిళంలో తెరకెక్కిన ‘కొలమావు కోకిల’ అనే సినిమాలో డ్రగ్స్ అమ్మే పాత్రలో కనిపించనుంది. కొత్త కథాంశంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నయన్ పాత్ర అద్భుతంగా ఉండబోతుందట. ఈ చిత్రం డ్రగ్స్ నేపధ్యంలో కొనసాగనుందని సమాచారం. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ మాట్లాడుతూ.. ఆర్థికంగ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఓ యువతి స్మగ్లింగ్ వైపు ఎలా మళ్లింది. అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నయనతార నటన సినిమాకు ప్లస్ పాయింట్‌ అన్నారు.

ఈ సినిమాతో నయన్‌కు అవార్డు కూడా రావచ్చని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జై సింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -