అందులో వాస్తవం లేదు..

353
Tarun
- Advertisement -

తెలుగులో బిగ్‌బాస్ సీజన్1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలుసు. బిగ్‌బాస్‌ పుణ్యమా అంటూ కొందరికి సినిమాల్లో అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. సీజన్‌1లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అలరించారు. విజేతగా శివబాలాజీ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇక సీజన్ 1 విజయం సాధించడంతో సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Traun-on-Bigg-Boss

అనుకున్నట్లుగానే త్వరలో నానీ హోస్ట్‌గా బిగ్‌బాస్ 2 రావడానికి అంతా సిద్దమైనట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ షోలో కొందరు నటీనటులు కంటెస్టెంట్‌గా వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నటీ శ్రీరెడ్డి పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఇలా ఎందరో నటీనటుల పేర్లు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లుగా వస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా హీరో తరుణ్‌ ఉండబోతున్నాడన్న వార్త కూడా వినిపిస్తోంది.

బిగ్‌బాస్‌లో కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..ఇలాంటి వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపెట్ చేసేందుకు ఇంటెన్షన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ కూడా లేదని ఆయన తెలిపారు.

- Advertisement -