వరి ధాన్యం కోనుగోళ్లకు 3,327కేంద్రాలు

350
civil-supply
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లకు 3,327 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పౌరసరఫరాల సంస్ధ కమీషనర్ అకున్ సబర్వాల్. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో పౌరసరఫరాల సంస్ధ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు కోటి మెట్రిక్‌ టన్నులు దాటే అవకాశం ఉందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తొలిసారి రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సారి వ్యవసాయ శాఖకు కూడా భాగస్వామ్యం కల్పించామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓ ఇంచార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యాన్ని తరలించకుండా సరిహద్దుల్లో చెక్ పొస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా డౌట్లు వస్తే ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

- Advertisement -