ఆదిలాబాద్‌లో ఎస్సైపై దాడి..పరిస్ధితి ఉద్రిక్తం

334
ts police

ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులపైనే దాడి జరిగింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న నిందితుడి కుటుంబ సభ్యులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తె.. ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్‌లో ఆటో యాక్సిడెంట్ జరిగిన కేసు విషయంలో పేలే ఘనశ్యాం అనే వ్యక్తిపై కేసు నమోదుచేశారు పోలీసులు. దీంతో శ్యాంని తీసుకెళ్లడానికి వచ్చిన పోలీసులకు ఉహించని పరిణామం ఎదురైంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు నిందితుడి తరపు బంధువులు.

శ్యాంని తీసుకెళ్లకుండా పోలీస్ వాహనానికి అడ్డు తగిలారు. జీపు ముందు బైఠాయించారు. పోలీస్ వాహనం తాళం చెవిని లాక్కున్నారు. ఎస్‌ఐ గంగరాంపై దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉట్నూర్ సీఐ వినోద్ ఘటన స్ధలాలన్ని సందర్శించారు. ఘటన పై విచారణ చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది.