1969 ఉద్యమం కూడా నీళ్లు-నిధుల కోసం జరిగింది…తెలంగాణ మలిదశ ఉద్యమం నీళ్లు-నిధుల కోసం నడిచిందని తెలిపారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ శాసన మండలి కమిటీ హాల్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన గుత్తా..2004 వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పటికీ అప్పుడే తెలంగాణ కోసం పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ని వ్యతిరేకించామని చెప్పారు.
44వేల క్యూసెక్కుల నీళ్లు తండ్రి వై యస్ ఆర్ తీసుకొని పోవాలని చూస్తే కొడుకు అత్యాశతో 80వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకెళ్లేందుకు దురాలోచన చేస్తున్నారని మండిపడ్డారు.విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల అంశాలు పూర్తిగా తేలలేదని..కేసీఆర్ నాయకత్వంలో పోతిరెడ్డిపాడు నుంచి 80వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీ తీసుకుపోయే ప్రసక్తే లేదు అన్నారు.
ఆనాడు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పైన ఒక్క మాట మాట్లాడని కొందరు నాయకులు ఇవ్వాళ కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. కొందరు నేతలు అయితే ఏకంగా కాంట్రాక్టు లు తీసుకొని ఆంధ్ర నేతలకు వత్తసు పలికారని విమర్శించారు గుత్తా.
జాతీయ పార్టీలు ఇంకా ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాయి. ఏపీలో ఒక విధంగా తెలంగాణలో మరో విధంగా జాతీయ పార్టీల నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ ఇప్పటికి కరువుతో కొట్లాడుతోందని…అకాల వర్షంతో కొన్ని చోట్ల రైతులకు సమస్య వస్తే దాన్ని రాజకీయానికి ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయన్నారు.
పోతిరెడ్డిపాడు సమస్య పరిష్కారానికి ఉపవాస దీక్షలు చేస్తే ఏమి రాదని…రెండు గంటల ఉపవాస దీక్ష చేస్తే ఏమిరాదు-ఇప్పటి వరకు నేను అలాంటి దీక్షలు చూడలేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు 30 టీఎంసీల నీళ్లను దొంగచాటున ఏపీ తీసుకుపోయిందని తెలంగాణ అధికారులు చెప్తున్నారని..తప్పు చేస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా సహించని ముఖ్యమంత్రి కేసీఆర్….జగన్ చేస్తున్న జల దోపిడీని అస్సలు ఉపేక్షించరని చెప్పారు. 203 జీవోను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విత్ డ్రా చేసుకోవాలన్నారు.
ప్రతిపక్షాలు రాజకీయాలను వదిలి పోతిరెడ్డి పాడుని అడ్డుకునే విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని…తెలంగాణ బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపైన ఒత్తిడి తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనక్కి తీసుకునే విధంగా చేయాలన్నారు.