కాంగ్రెస్ నాయకులవి పగటికలలు: గుత్తా

100
gutha

కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చిట్యాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన గుత్తా..రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రతి పక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఇకనైనా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విలువైన సూచనలు చేయాలని హితవు పలికారు.

హుజురాబాద్‌ నుంచి ప్రవేశపెట్టనున్న పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివేనని గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రితో ప్రజల ముందు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మైక్ లాక్కుని చేసిన పని సరైంది కాదన్నారు. హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్లో పెట్టినవే. ఇప్పుడు అమలు చేస్తున్నాం తప్ప ఎన్నికల కోసం ఆర్భాటంగా చేసిన పథకాలు కావని గుత్తా స్పష్టం చేశారు.