సీఎంఆర్‌ఎఫ్‌కు గుత్తా అమిత్ 25 లక్షల విరాళం..

297
minister ktr

క‌రొనా మ‌హ‌మ్మ‌రి నుండి మ‌న రాష్టాన్ని కాపాడుకునెంద‌కు రాష్ట్రముఖ్య‌మంత్రి,అధికార యంత్రంగం అహ‌ర్నిష‌లు శ్ర‌మిస్తున్నారు.క‌రోన భాదితుల‌కు చికిత్స అందించ‌డానికి,ప్ర‌జ‌ల‌కు స‌కల వ‌స‌తులు కల్పించడానికి త‌మ వంతు సాయంగా శాస‌న మండ‌లి చైర్మైన్ గుత్తా సుఖెంద‌ర్ రెడ్డి త‌న‌యుడు గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ముంద‌కు వ‌చ్చారు. ఈ రోజు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని క‌లిసిన గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి స‌హ‌య‌నిధికి వారి కంపెనీ, మరియు కుటుంబ సభ్యుల తరుపున 25 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళంగా ఇచ్చారు.

క‌రోన వైర‌స్‌ను నాశనం చేయాడానికి తెలంగాణ ప్ర‌భుత్వం అద్బుతంగా ప‌ని చేస్తుంద‌ని,త్వ‌ర‌లోనే క‌రోన ర‌హిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిల‌బ‌డుతుంది అనే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో అపారంగా ఉంద‌ని అమిత్ కుమార్ రెడ్డి తెలిపారు. క‌రోన వైర‌స్ నుండి రాష్టాన్ని కాపాడెందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి ,మినిష్ట‌ర్ కేటీఆర్‌కి, అధికారులకు, వైద్యులకు, ప్రభుత్వ సిబ్బందికి, మీడియా మిత్రులకు, అమిత్ కుమార్ రెడ్డి ప్ర‌త్యేక ధన్య‌వాద‌లు తెలిపారు.