కేటీఆర్‌కు కోటి 13 లక్షల చెక్కు అందజేసిన తలసాని..

287
ktr

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సహకారంగా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు, వ్యాపారులు, సంస్థల నిర్వాహకులు శుక్రవారం ఒక కోటి 13 లక్షల రూపాయల చెక్కులను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు అందజేశారు.

ఇందులో అమీర్ పేట, ఎస్‌ఆర్‌ నగర్ లలోని హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34 లక్షలు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలు, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 6 గురు కార్పొరేటర్లు ఒకొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున 12 లక్షలు ఇంకా పలువురు విరాళాలు అందజేశారు.