24 గంటల్లో కొత్తగా 678 కరోనా కేసులు..

288
lav agrwal

దేశంలో కరోనా ప్రభావానికి సంబంధించి ఈ రోజు తాజా హెల్త్ బులిటెన్‌ను కేంద్రం విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 33 మంది మృతి చెందగా.. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,412 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..199 మంది మరణించారు. 503 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు

‘నిన్న ఒక్కరోజే 16002 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశాం. 2 కోట్ల హైడ్రోక్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ సిద్ధంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జనవరిలో మనకు ఉన్నది ఒకే ఒక్క ల్యాబ్‌. ప్రస్తుతం దేశంలో 146 ప్రభుత్వ ల్యాబ్స్‌, 67 ప్రైవేట్‌ ల్యాబ్స్‌ అందుబాటులో ఉన్నాయని’ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.