గురుపౌర్ణమి.. భక్తుల రద్దీ

46
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి శోభ సంతరించుకుంది. బాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురుపౌర్ణమి అని పిలుస్తారు. హిందులు ప్రతిఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజును గురుపూజోత్సవం జరిపి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం శుభసూచకమని భావిస్తారు.

Also Read:Guru Pournami:గురు పూర్ణిమ విశిష్టత

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. హనుమకొండలోని సాయిబాబా క్షేత్రంలో, కరీంనగర్‌లోని సీతారాంపూర్‌, భాగ్యనగర్‌, సాయినగర్‌ సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు.

Also Read:అవినీతికి కేరాఫ్‌ కాంగ్రెస్‌:కేటీఆర్ ఫైర్

- Advertisement -