బాబా చెప్పాడు… నటిస్తున్నాను

240
Vijay Chander as Saibaba in Saye daivam
- Advertisement -

“కరుణామయుడు, “సాయిబాబా పాత్రలు పోషించిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇభిమానులు ఆరాధనగా చూస్తున్నారు, నాలో బాబాను చూస్తున్నారు, భక్తులు పాదాభివందనాలు చేస్తున్నారు” అని ప్రముఖ నటుడు విజయచందర్ పేర్కొన్నారు, “నటుడిగా ఒకపాత్ర చేశాళఇప్పటికీ ప్రేడ్లపలు గుర్తుంచుకోవడం ఇదృష్యగా భావిస్తున్నాను, వారి ఆరాధన గురించి ఎంతచెప్పినా తప్కవే 81 ఏళ్ళ విరామం తర్వాత సాయేదైవంలో మళ్ళీ బాబా పాత్ర చేస్తున్నాను. ఇది బాబా ఆజ్ఞమేరకే జరుగుతోంది, “ఇప్పడు నువ్వ బాబా పాత్ర చేయాల్సిన అవసరం ఉందని” ఆయన ఇదేశించడం వల్ల సాయేదైవంలో నటిస్తున్నట్టుగా” విజయచందర్ స్పష్టం చేశారు. మే 24 విజయచందర్ పట్టినరోజు ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడారు. ఇప్పడు నావయస్సు80 సంవత్సరాలు, బాబాగేటప్ వేసుకుని నటిస్తుంటే ఒక భక్తురాలు వచ్చిన మీరు ఈ వేశం కోసమే పట్టారు ఇని చెప్పడం ఆనందంకలిగించింది. మీరు బాబా దత్తపుత్రుడు ఆనిమరొక భక్తుడు అన్నారు. ఈ మాటలు వింటుంటే ఆంగా బాబాఆశీర్వాదం అనిపిస్తుందని విజయచందర్ చెప్పారు.

Vijay Chander as Saibaba in Saye daivam
విజయచందర్, సుమన్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, సాయిప్రకాష్ ప్రధాన పాత్రధారులుగా జిఎల్‌బి మూవీమేకర్స్ నిర్మిస్తున్నపతాకంపై భవాని అర్జున్‌రావు పొనుగోటి నిర్మిస్తున్న చిత్రం ‘సాయేదైవం’. శ్రీనివాస్ జిఎల్‌బి దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే చిత్రకరణ పూర్తయింది. పాటలను కూడా విడుదల చేశారు. త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని నిర్మాత భవాని అర్జున్ రావు పొనుగోటి చెప్పారు. సినిమా సంతృప్తికరంగా వచ్చిందని, బాబా భక్తులందరికీ నచ్చుతుందని ఆమె తెలిపారు.

దర్శకుడు శ్రీనివాన్ జిఎల్‌బి మాట్లాడుతూ “సాయేదైవం చిత్రంలో విభిన్న ఇంశాలను చూపిస్తున్నాం, బాబా భక్తుల అనుభవాలు, బాబా మహిమలు వంటివి ప్రేక్షకులను కట్టిపడేస్తాయని.. మూడు దశాబ్దాల తర్వాత విజయచందర్ బాబాగా నటించడం హైలెట్, ఎప్పటికీ బాబా అంటే ఆయనే. కన్నడ దర్శకుడు సాయిప్రకాష్ అవదూతగా మరొక ముఖ్యపాత్రలో కనిపిస్తారు. ‘సాయేదైవం కోసం భక్తుల అనుభవాలను సేకరించడం జరిగింది. సంగీతపరంగా కూడా మాసినిమాకు ఆదరణ లభించడం సంతోషంగాఉంది అన్నారు.

సాయేదైవం చిత్రానికి సంగీతం, మాటలు: పోలూర్ ఘటికాచలం, పాటలు; బిక్కి కృష్ణ, ఛాయాగ్రహణం: టి.సురేందర్ రెడ్డి, ఎడిటింగ్ నందమూరి హరి, సహనిర్మాతః శత్రుఘ్న కొతూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ : పుల్లూరి లక్ష్మీచంద్ర, జి.యస్.రామకృష్ణ, నిర్మాత:భవాని అర్జున్‌ రావు పొనుగోటి, కథ, స్క్రీన్‌ ప్లే,నిర్మాత, దర్శకత్వం:శ్రీనివాస్ జిఎల్‌బి.

- Advertisement -