దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి…ఖైదీ నెంబర్ 150తో మరోసారి తానెంటో నిరూపించుకున్నాడు. సినిమా విడుదలకు ముందే సాంగ్స్ దగ్గరి నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకు టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు ఏ హీరో సాధించలేని రికార్డులను ఖైదీ నెంబర్ 150 సొంతం చేసుకుంద. ఎక్కడ చూసినా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు…రత్తాలు సాంగ్స్‌తో కేక పుట్టిస్తునే…రైతు సమస్యలపై కన్నీరు పెట్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సిస్‌లోనూ మెగాస్టార్ తన సత్తాచాటుతున్నాడు. తాజాగా ఖైదీ ఫీవర్ రియాద్‌కు పాకింది. రియాద్‌లో ఏకంగా ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తమ ఉద్యోగులకు జనవరి 11న హాలీడే ప్రకటించింది. హాలీడే వివరాలను పేర్కొంటూ ఓ నెటిజన్ నోటిస్ పేపర్‌ను పోస్ట్ చేశాడు.
దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్‌ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు.
గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్‌లోని తమ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలీడే ఇచ్చింది. కబాలి మూవీ విడుదల రోజున(జూలై 22న) చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవుదినంగా ప్రకటించింది.