గణేశ్ నిమజ్జనం…రేపు సెలవు

918

వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో రేపు(గురువారం) సందర్భంగా సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాల పరిధిలోని హైదరాబాద్,రంగారెడ్డి,సికింద్రాబాద్,మేడ్చల్,మల్కాజ్‌గిరి జిల్లాల్లో స్కూళ్లు,కాలేజీలు,ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగేందుకు 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు సీపీ. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో సీపీ ఆఫీస్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. 11,198 విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశాం. ప్రతీ పోలీసు స్టేషన్‌లో పర్యవేక్షణ బృందం ఉంటుందన్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల మేర కొనసాగనుందని ఉదయం 11.30 గంటల వరకు మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందన్నారు.

hyderabad holiday