డబ్బున్న వారికే శ్రీవారి దర్శనం..

101
Mohan-Babu

నటుడు..మాజీ ఎంపీ మోహాన్ బాబు..తిరుమల తిరుపతి దేవస్థానంలోని అసౌకర్యాలపై అసహానం వ్యక్తం చేశాడు. దేవస్థానం అధికారులపై మండిపడ్డారు. డబ్బున్న వారికే తిరుమలలో శ్రీవారి దర్శనం లభిస్తోందని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఎదుట మోహన్‌బాబు మాట్లాడుతూ ‘గుడిలో ఒక్కొక్కసారి ఒక్కో నిబంధన పెడుతున్నారు. అధికారి మారినప్పుడల్లా.. వారికి ఇష్టం వచ్చినట్లు మార్పులు తెస్తారు. భక్తులకు మేలు చేసేదైతే ఫరవాలేదని, కానీ భక్తులకు ఏం మేలు జరగట్లేదని ఆయన విమర్శించారు.

గుడిలో ధ్వజస్తంభం ఉంది… దాన్ని కొందరినే తాకనిస్తారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇవాళ నేను చాలా బాధ పడ్డానని ఆయన పేర్కోన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నంతగా ఇప్పుడు ఇక్కడ పాలన జరగడం లేదని ఆయన అన్నారు. మోహన్ బాబు ఏం చెప్పాలనుకున్నా ముఖం మీదే చెప్పేయడం ఆయనకు అలవాటు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అయన ఇలా అక్కడి అధికారుల తీరుపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బతీస్తుందన్నారు.