కబాలి దర్శకుడితో రానా మల్టీస్టారర్

292
Pa Ranjith Multistarer
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కాలా, కబాలి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్ త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా తీయనున్నాడు. తెలుగు హీరో రానా, తమిళ్ హీరో ఆర్య తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడట. త్వరలోనే ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. ఈచిత్రానికి సంబంధించిన పూర్తీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక పా రంజిత్ తెరకెక్కించిన రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు పా.రంజిత్‌ ప్రస్తుతం హిందీలో ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా బయోపిక్‌ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందట. ఈసినిమా పూర్తైన తర్వాత మల్టీస్టారర్ తెరకెక్కించనున్నారని సమచారం.

- Advertisement -