గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం అని వేలంపాట వేయడాన్ని యావత్ విద్యార్థులోకం మరియు పర్యావరణవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్న అన్నారు న్యాయవాది కారుపోతుల రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి పునరాలోచన చేయకుండా మూర్ఖంగా ముందుకు పోవడంతో ఇట్టి విషయంపై చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఇట్టి అనైతికమైన వేలం పాటను అడ్డుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు మరియు వివిధ రకాల జీవరాశులతో చక్కటి వైద్యం కలిగినటువంటి భూమిలోని చెట్లను నరికి వేయడం ఒక అవివేకమైనటువంటి చర్య అని మండిపడ్డారు.
ప్రస్తుతం ఈ 400 ఎకరాలలో అనేక రకాల జీవరాశులు మరియు వివిధ రకాల వృక్షాలతో చక్కటి జీవవైవిద్యాన్ని కలిగి కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్ కు కొంతమేర కాలుష్యం నుండి ఉపశమనం కల్పిస్తున్నటువంటి ఇలాంటి పర్యావరణ ప్రాంతాలను రూపుమాపాలనుకోవడం మంచిది కాదని అదేవిధంగా ఇట్టి విషయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో న్యాయపరంగా కొట్లాడి న్యాయం పొందే వరకు పోరాడుతానని ఉద్ఘటించారు.
Also Read:వీడియో.. అద్భుత క్యాచ్ పట్టిన గ్రౌండ్‌మ్యాన్!