ఫాస్టాగ్ అమలు వాయిదా…

496
fastag
- Advertisement -

డిసెంబర్ 1 నుంచి దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాహనదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు ఫాస్టాగ్ అమలును వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్‌ను అమలు చేస్తామని ప్రకటించింది.

టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా..వాహనదారుల టైం వేస్ట్ కాకుండా ఫాస్టాగ్ ఉపయోగపడనుంది. ఫాస్టాగ్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వాహనదారులు టోల్ ప్లాజా నుండి సులువుగా వెళ్లిపోవచ్చు.

ఫాస్ట్ టాగ్ లైన్ లో ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ రుసుము కట్టకుండా వెళ్తే రెట్టింపు టోల్ వసూలు చేయనున్నారు.

- Advertisement -