డిసెంబర్‌ 1 నుంచి ఫాస్ట్ టాగ్: కృష్ణ ప్రసాద్

732
krishna prasad
- Advertisement -

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఫాస్ట్ టాగ్ అమలు చేస్తున్నామని తెలిపారు తెలంగాణ రీజనల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్. హైదరాబాద్ ఆస్కి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ 17 టోల్ ప్లాజాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఫాస్ట్ టాగ్ ని సదరు వాహనాదారుని వాహనానికి అమర్చుతాం..ఈ టాగ్ ని బ్యాంక్ అకౌంట్ కి అనుసంధానం చేస్తాం అన్నారు. ఏ మొబైల్ వాలెట్ నుండి కానీ ప్రత్యేక కౌంటర్ లలో రీఛార్జి చేసుకోవచ్చన్నారు. ఈ ఫాస్ట్ టాగ్ ద్వారా టోల్ ప్లాజా నుండి సులువుగా వెళ్లిపోవచ్చని..సమయం ఎక్కువగా ఆదా అవుతుందని చెప్పారు.

దీనికోసం టోల్ ప్లాజా ల దగ్గర ప్రత్యేక సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ట్రక్కులకు కూడా దీన్ని అనుసంధానం చేయడం వల్ల ఆ ట్రక్కు వాహనం ఏ టోల్ ప్లాజా దాటింది అనేది తెలుసుకోవచ్చన్నారు.

ఫాస్ట్ టాగ్ యాప్ ద్వారా కూడా ఫాస్ట్ టాగ్ కోసం వాహదారుడూ అప్లై చేసుకోవచ్చని..ఫాస్ట్ టాగ్ లైన్ లో ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ రుసుము కట్టకుండా వెళ్తే రెట్టింపు టోల్ వసూలు చేస్తాం అన్నారు. 24 గంటల్లో ఒక్క టోల్ ప్లాజా నుండి అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తే రాయితీ వస్తుందన్నారు.

A Krishna Prasad, regional officer, NHAI Hyderabad, said, “We are transitioning to FASTag at 17 toll plazas

- Advertisement -