నల్గొండకు గవర్నర్ తమిళిసై..

88
tamilisai
- Advertisement -

గవర్నర్ తమిళి సై ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారభించనున్నారు. అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.

తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని.. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభిస్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

- Advertisement -