బిగ్ బాస్ 5..మట్టిలో మాణిక్యం ‘రవి’

22
ravi

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. బుధవారం ఎపిసోడ్‌లో భాగంగా మట్టిలో మాణిక్యం టాస్క్‌లో యాంకర్ రవి విజేతగా నిలిచారు. తర్వాత జరిగిన రాజుగారి గోడ టాస్క్‌లో సన్నీ విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు పోటీ కొట్లాటకు దారితీయగా ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలనే ఆలోచనే హౌస్ లోని కంటెస్టెంట్స్ వ్యూహాలు సిద్ధం చేశారు. షణ్ముఖ్, సిరి, జస్వంత్ ముగ్గురుకి ‘త్రిమూర్తులు’ అనే పదాన్ని ప్రియా కాయిన్ చేసింది.

ఇక మట్టిలో మాణిక్యం టాస్క్లో భాగంగా రవి విజేతగా నిలిచారు. వెస్లింగ్ పిట్ లో మొదటిసారిగా సన్నీ తరఫు నుండి విశ్వ, రవి వైపు నుండి మానస్ దిగారు. అందులో విశ్వ… మానస్ ను క్షణాల్లో మట్టి కరిపించాడు. తర్వాత యానీతో రవి టీమ్ కు చెందిన జెస్సీ పోటీపడగా జెస్సీ గెలిచాడు. ఇక థర్డ్ టైమ్ పింకీతో శ్వేత తలపడింది. అందులో శ్వేత విజేతగా నిలిచింది.దీంతో రవి టీమ్ విజేతగా నిలిచింది.

ఇక తర్వాత జరిగిన ‘రాజుగారి గోడ’ టాస్క్ లో సన్నీ విజేతగా నిలిచాడు. గార్డెన్ ఏరియాలో రెండు స్టాండీలను పెట్టి, అందులో సన్నీ టీమ్ అతని ఫోటోతోనూ, రవి టీమ్ అతని ఫోటోలను ఆ స్టాండీలో పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి పెట్టిన ఫోటోలను ప్రత్యర్థి వర్గం కిందపడేసే ఆస్కారం ఉంది. అలా సన్నీ టీమ్ దాదాపుగా పూర్తి స్థాయిలో ఫోటోలు పెట్టిన తర్వాత విశ్వ దురుసుగా అక్కడకు వచ్చి స్టాండీ లోని ఫోటోలన్నీ కింద పడేసి రచ్చరచ్చచేయగా ఈ గేమ్ లో చివరకు సన్నీకి రెండు, రవికి ఒక ఓటు దక్కాయి. అలా సన్నీ విజేతగా నిలిచాడు.

తర్వాత లాక్కో లాక్కో తాడులో సన్నీ టీం విజేతగా నిలిచింది. అప్పటి వరకూ కెప్టెన్ గా ఉన్న శ్రీరామ్ తన ప్లేస్ లో హమిదాను సంచారకురాలిగా నియమించి, తాను రవి తరఫున లాక్కో లాక్కో మేక టాస్క్ లో ఆడేందుకు బరిలోకి దిగాడు. కానీ ఫలితం లేకపోయింది.