భారీ వర్షాలు…రెండు రోజులు సెలవులు

162
rains
- Advertisement -

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ముఖ్యంగా భాగ్యనగరంలో పలుకాలనీలు చెరువులను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు,రేపు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని …పాత భవనాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇక జీహెచ్‌ఎంసీలో పరిస్ధితులపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించిన కేటీఆర్…ప్రజాప్రతినిధులు క్షేత్రస్ధాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న ఆయన అర్ధరాత్రి వరకు వర్షాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

- Advertisement -