ఉచిత మొక్కల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్

389
Governer
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్. ఈసందర్భంగా తొలి మొక్కను గవర్నర్ తమిళసై స్వీకరించారు. మొక్కలు పంచడం మంచి కార్యక్రమం అని సంస్ధ ప్రతినిధులను అభినందించారు గవర్నర్.

ఈసందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ… బుక్ ఫేర్ కొచ్చే ప్రజలందరికీ ఈ గ్రీన్ చాలెంజ్ యొక్క ఉద్దేశాన్ని తెలుపుతూ.. మీరు పుస్తకాల తో పాటు మొక్కలు కూడా తీసుకొని వెళ్లి మీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుక్ పేరు నిర్వాహకులు జూలూరి గౌరీశంకర్; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -