ఇటీవలె ఆక్సిజన్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న గోపిచంద్ మరో సినిమాను పూర్త చేయబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకి ‘గౌతమ్ నంద’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేయబోతునట్లు సమాచారం. ఇప్పటివరకు గోపిచంద్ డ్యూయల్ రోల్స్ లో కనిపించిందే లేదు. మొదటిసారిగా ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. దీనికోసం దర్శకుడు సంపత్ కథ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట.
మొదట ఈ చిత్రానికి బలం అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. హృతిక్ రోషన్ తన కాబిల్ చిత్రాన్ని తెలుగులో బలం పేరుతో విడుదల చేయటంతో ఈ సినిమా పేరును గౌతమ్ నందాగా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. గౌతమ్ నందా అనేది అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో గోపిచంద్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తు సినిమాపై అంచనాలను పెంచేశాడు.
ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ దుబాయ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసి, హైదరాబాద్ కి తిరిగొచ్చేసింది. దుబాయ్ లో కొన్ని సన్నివేశాలతో పాటు రెండు పాటలను చిత్రీకరించారు.అయితే గోపీచంద్ ఇంట్రడక్షన్ సాంగ్ .. నాయకా నాయికల మధ్య రొమాంటిక్ సాంగ్ ను అక్కడ చిత్రీకరించారు. రాజు సుందరం .. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాటలు చాలా బాగా వచ్చాయని సంపత్ నంది చెప్పాడు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.