తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. సమాజానికి కొత్త పాత్రలో సేవ చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను అధికారాన్ని కోరుకునే ఉద్దేశంతో కాకుండా, సమాజాన్ని మెరుగుపరిచే ఆశయంతో రాజకీయాలలోకి వస్తున్నానని స్పష్టం చేశారు.
కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని తానేలంక గ్రామ సందర్శన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏబీ.. ఈ మేరకు ప్రకటన చేశారు.అన్యాయానికి గురైన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని కలిసి సంఘీభావం తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో బాధపడిన వేలాది మందిలో శ్రీను ఒకరి.. అలాంటి బాధితుల్ని పరామర్శించి, వారికి మద్దతుగా నిలుస్తానని చెప్పారు.
Also Read:16న ఎమ్మెల్సీగా దాసోజు ప్రమాణస్వీకారం
జగన్‌పై వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ ఆయన పాలనలో జరిగిన అక్రమాలను బహిర్గతం చేయాలనే ఆలోచన మాత్రం ఉంది. ఇది పది లేదా వందల కేసుల విషయంలో కాదు… వేల కొద్ది ఘోరాలు జరిగాయి అన్నారు. జగన్ పాలనలో చోటుచేసుకున్న అక్రమాలపై సమాచారం ఉన్న వారు వాటిని వాట్సాప్ నెంబర్ 7816020048కు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

