వీడియో..పూరి క్షేత్రంలో వింత ఘటన

12
- Advertisement -

పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. నీలచక్రంపై ఎగిరే జెండాను పట్టుకెళ్లింది గద్ద. పూరీ ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టింది ఓ గద్ద

పూరీకి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం చేసుకుని మొక్కడం ఆనవాయితీ. నిత్యం సాయంత్రం 5 గంటల సమయంలో పూరీలో జెండా మార్చే పద్దతి ఉండగా ఎన్నడూ లేనివిధంగా ఓ పక్షి లాక్కెళ్లడంతో వింతగా చూశారు భక్తులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Also  Read:ఇంటర్‌ తర్వాతే టెన్త్ రిజల్ట్స్!

- Advertisement -