ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఇక పండగే..

284
- Advertisement -

బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా పనుల్లో వేగం పెంచాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్ ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేసిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ ను బాహుబలి రిలీజ్ కన్నా ఐదు రోజుల ముందే విడుదల చేస్తున్నారట.
  Prabhas 19 Film Title & First Look Poster on April 23rd;
ప్రస్తుతం టీజర్ కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే రోజు టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్ ను రివీల్ చేయనున్నారు. తరువాత బాహుబలి 2 సినిమాతో పాటు టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ అవుతున్న తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ‘ప్రభాస్ 19’ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.

ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శంకర్ ఇషాన్ లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి డార్లింగ్‌ ప్రభాస్‌ తన ఫ్యాన్స్‌కి బాహుబిలి2తో పాటు, తన కొత్త మూవీ అప్‌డేట్‌తో మరింత సంతోషాన్నిస్తున్నాడు.

- Advertisement -