పెరిగిన బంగారం ధరలు…

233
gold rate

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లో కూడా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 110 రూపాయలు పెరిగి 50,355 రూపాయలకు చేరగా వెండి కిలో 273 రూపాయలు పెరిగి రూ.60,815కి చేరింది.

అమెరికాలో కరోనా వైరస్‌ ఉద్దీపన ప్యాకేజ్‌ 1.8 లక్షల కోట్ల డాలర్లు ఎంతమాత్రం సరిపోదని పెలోసి తిరస్కరించడంతో ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే ఎదురవడటంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీంతో బంగారం ధరలు పెరిగాయి.