24*7 అందుబాటులో సహాయక బృందాలు : బొంతు

81
bonthu rammohan

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్‌ రోడ్లన్నీ జలమయయ్యాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహించారు మేయర్ బొంతు రామ్మోహన్‌.

ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని…. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం చేయాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సేవల కోసం 040-211111111 , విపత్తు నిర్వహణశాఖ నంబర్‌ 9000113667, చెట్ల తొలగింపు సిబ్బంది నంబర్‌ 6309062583, విద్యుత్ శాఖ నంబర్‌ 9440813750, ఎన్డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 8333068536, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 040-29555500, ఎంసీహెచ్‌ విపత్తు నిర్వహణశాఖ నంబర్‌ 9704601866లను సంప్రదించాలని కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.