కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడు- కౌశిక్ రెడ్డి

36
Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కొండాపూర్‌లోని తన నివాసం నుండి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీ లకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ,పీసీసీ సెక్రెటరికి,హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా పార్టీకి రాజీనామా చేస్తున్న.. నా రాజకీయ నిర్ణయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.. ఇది నా స్వంత నిర్ణయం.. ఉదయం నుండి ఉత్తమ్ చాలా సార్లు ఫోన్ చేశారు.. రాజీనామా చేయవద్దని.. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నాకు చాలా బాధ కలిగించింది అన్నారు. ఎంతో బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో తాను మొదటివాడినని చెప్పారు. అయితే, రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్ముడుపోయింది తాను కాదని, రేవంత్ అమ్ముడుపోయారని, ఈటల రాజేందర్ కు అమ్ముుపోయారని ఆరోపించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలవలేదన్న రేవంత్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.

ఇదే సమయంలో రేవంత్ కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సత్తా ఉంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ ఇచ్చిన రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నానని… తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనుకుంటున్నానని చెప్పారు.

టీడీపీ నుండి వచ్చిన వారికి పిసిసి ఇస్తే ..30 ఏళ్ల నుండి జెండా మోస్తున్న వారు ఏమైపోవాలి. శ్రీధర్ బాబు ,కోమటిరెడ్డి లకు పిసిసి ఇస్తే బాగుండేది.. హుజురాబాద్ ఎన్నికలు అని తెలిసి 50 – 70 రోజులు అవుతుంది.. బీజేపీ ,టీఆరెస్ తన పని తాను చేసుకుంటుంది. మరి కాంగ్రెస్ కు ఇంచార్జ్ ను ఎందుకు వేయరు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ 100 శాతం బెటర్. దుబ్బాక లో కార్యకర్తలకు ధైర్యం నింపాడు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి రాగానే ముఖ్యమంత్రి లా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ ని తాకట్టు పెడుతున్నాడు. హుజురాబాద్ ఎన్నికలపై కాంగ్రెస్ కనీసం స్పందించడం లేదు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ కి అమ్ముడుపోయిండు. ఈటెల స్కాం చేసాడు దొంగ అని రేవంత్ రెడ్డి చెప్పాడు. కొడంగల్ ఎన్నికల్లో నీకు ఎన్ని ఓట్లు వచ్చాయో హుజురాబాద్ లో నాకు అన్నే వచ్చాయి. సొంతూరులో ఎమ్మెల్యే ఎన్నికల్లో డిపాజిట్ లేని వాడు ,కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో 40 వేళా ఓట్లు రనివాడికి టికెట్ ఇస్తున్నాడు కౌశిక్ రెడ్డి దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవని వాడు ముఖ్యమంత్రి అని ఎలా అవుతారు. ఆయన ఎక్కడికి పోయిన నలుగురిని పోగేసి సీఎం సీఎం అని జిందాబాద్ కొట్టిస్తాడు. పొన్నం ప్రభాకర్ ,రేవంత్ రెడ్డిలు ఈటెలకు కోవర్టులుగా పనిచేస్తున్నారు. మా ఆస్తులు పోయిన కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నామన్నారు. హుజురాబాద్‌లో ఒక్కరు కూడా ఉండరు కార్యకర్తలతో సహా అందరూ రెండు మూడు రోజుల్లో రాజీనామా చేస్తారు. హుజురాబాద్‌లో పొన్నం ప్రభాకర్ దమ్ము ఉంటే డిపాజిట్ తెచ్చుకోవాలి. పొన్నం ప్రభాకర్.. పెద్థ పెద్ద మాటలు మాట్లాడుతున్నడు.. గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు. ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి తొలగించడం అన్యాయం అంటారు. ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఈటల వద్ద పొన్నం ప్రభాకర్ డబ్బులు తెచ్చుకుంటారు. దమ్ము, ధైర్యం ఉంటే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిలు హుజురాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ చేస్తున్న అన్నారు. ఈటల రాజేందర్ కు గత ఎన్నికల్లో చెమటలు పట్టించా..

ఆయన దొంగతనం బట్టబయలు అయితే.. ఈ నేతలు మాత్రం ఈటలకు సపోర్ట్ చేస్తున్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని భావించా.. వీరి చేష్టలు బాధకరంగా అనిపించాయి. రేవంత్ రెడ్డి.. ఒక ముమైత్ ఖాన్.. సినిమాలో ఆమె లాగానే ఈయన పరిస్థితి. ఎక్కడికి పోయిన నలుగురిని పోగేసి సీఎం.. సీఎం అని జిందాబాద్ కొట్టిస్తాడు. ఇక నా భవిష్యత్ కార్యచరణ.. హుజురాబాద్ ప్రజలు నిర్ణయిస్తారు. రెండు, మూడు రోజుల్లో నా కార్యచరణ ప్రకటిస్తా.. అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.