కాంగ్రెస్‌వి దిగజారుడు రాజకీయాలు: గెల్లు శ్రీనివాస్

314
gellu srinivas yadav
- Advertisement -

సచివాలయం కూల్చివేత పై కాంగ్రెస్ పార్టీ వైఖరి ‘నవ్వి పోదురు గాక ..నాకేమిటి సిగ్గు ‘అన్నట్టుగా ఉందన్నారు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. కొత్త సచివాలయాన్ని నిర్మించకుండా ఏడాది కాలం పాటు అడ్డుపడ్డ కాంగ్రెస్ నేతలు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా రోజుకో కొర్రీ తో కోర్టులకు వెళ్లడం వారి దిగజారుడు తనాన్ని సూచిస్తోందన్నారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ యాదవ్…..రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్ట్ ని ‘చవక బారు ఎజెండా లతో మరింత దిగజారుస్తున్నారు
…మంత్రి వర్గ తీర్మానం లేదని ,పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా పాత సచివాలయం కూల్చి వేయడం లేదని కోర్టు కు వెళ్లిన కాంగ్రెస్ నేతలకు అపుడే ‘గుప్త నిధులు ‘ఉన్న విషయం ఎందుకు గుర్తు లేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గల్లీ పదవిగా మార్చి అడ్డగోలుగా అనవసర విషయాలను తేరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ లోనే చర్చ జరిగుతోందన్నారు. ఇన్నెండ్లు రాజకేయాల్లో వివిధ పదవుల్లో ఉన్న రేవంత్ రెడ్డి కి పాత సచివాలయం లో నిజాం గుప్త నిధుల గురించి చెప్పాలని రెండు రోజుల కు ముందు ఎందుకు అనిపించలేదు…గుప్త నిధులు తవ్వే ముఠా లో రేవంత్ రెడ్డి ఏమైనా సభ్యుడా ..?ఇలాంటి గ్యాంగులతో రేవంత్ రెడ్డి కి ఉన్న సంబంధాల పై ప్రభుత్వ ఆరా తీయాలన్నారు.

రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసులో ఇవ్వ జూపిన డబ్బులు గుప్త నిధుల తవ్వకాల్లో లభించినవే…రాజకీయాల్లో హుందా తనం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి సచివాలయం గుప్త నిధుల పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి…ఏదో రకంగా కొత్త సచివాలయం కట్టకుండా సీఎం కెసిఆర్ ను అడ్డుకునే కుట్ర లో భాగం గానే గుప్త నిధుల ఆరోపణలు చేశారని తెలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉండగా రేవంత్ రెడ్డి లాంటి పిచ్చోడి మాటలు నమ్మి సచివాలయం పరిసరాల్లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొన్ని రోజులు తవ్వకాలు జరిపినా బూడిద కూడా దొరకలేదన్నారు. రాజకీయాలు రేవంత్ కు ‘పిచ్చోడి చేతిలో ‘రాయిలా మారాయి…రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహులు రోజుకో వితండ వాదాన్ని తెర పైకి తెస్తూ పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని కట్టకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు.

ఎన్నో అవరోధాల మధ్య సీఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టుగానే కొత్త సచివాలయాన్ని తెలంగాణ ఆత్మగౌరవం పెంపొందేలా నిర్మించి తీరుతారు ..రేవంత్ రెడ్డి ఎన్ని గురివింద గింజ నీతులు చేప్పినా తెలంగాణ సమాజం ఆయన్ను ఓటుకు నోటు ‘దొంగ గానే పరిగణిస్తుందన్నారు.

రేవంత్ కు దమ్ముంటే ఇందిరాగాంధీ హాయం లో రాజాభరణాల రద్దులో భాగంగా తరలించుకు పోయిన నిజాం నగలు కాంగ్రెస్ నేతలకు ఎన్ని దక్కాయో లెక్కలు చెప్పాలి
…లేని గుప్త నిధుల గురించి మాట్లాడటం కాడు ..నిజాం నుంచి లాక్కున్న ఆస్తిని తెలంగాణ కు దక్కేలా రేవంత్ ఢిల్లీ లో తన పరపతిం ఉపయోగిస్తే మంచిది…దేశాన్ని అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్న వక్తి నిజాం ..సచివాలయం కూల్చివేతకు ..నిజాం గుప్త నిధుల పేరిట వివాదం సృష్టించే యత్నం చేయడం మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడమే …ప్రజల భద్రతా కారణాలతోనే ప్రభుత్వం పాత సచివాలయం కూల్చివేత దగ్గర నిషేదాజ్ఞలు విధించిందన్నారు.

- Advertisement -