మొక్కలు నాటిన జబర్దస్త్ టీం

41
gc jabardasth

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది. సెలబ్రిటీలు, నటులు ,వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు గచ్చిబౌలి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో జబర్దస్త్ టీం సభ్యులైన అదిరేఅభి, కెవ్వుకార్తిక్, రాజమౌళి, పొట్టి నరేష్, అప్పారావు, శ్రీమతి లక్ష్మి అప్పారావు ఆరుగురు కలిసి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు పెంచడం మనందరి బాధ్యత అని మొక్కలు లేనిదే మానవాళి లేదని మనము భోజనం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు నీరు లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమని రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దీన్ని నివారించాలంటే మనందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. కరోనా వైరస్ కారణంగా మనందరము ముక్కులకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాము అని రాబోయే రోజుల్లో మనము మొక్కలు పెంచడాన్ని నిర్లక్ష్యం చేస్తే వాతావరణ కాలుష్యం పెరిగి ప్రతి ఒక్కరు మన వీపున ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఒక ఉద్యమంలో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి వారి మిత్రబృందానికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములై మేము కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం కోసం ప్రచారకర్తలగా మా బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా మా మిత్రులకు ఈ చాలెంజ్ ఇచ్చి వారి చేత మొక్కలు నాటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి మొక్కలపై ఒక చక్కని గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.