12న ‘గీత‌ గోవిందం’ ప్రీ రిలీజ్‌..

192

ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌లో చేస్తున్న చిత్రం ‘గీత‌ గోవిందం’. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. విజయ్‌ అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక ఇదివరకే విడుదలైన టీజర్లు .. ట్రైలర్లు .. పాటలకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. గీతాఆర్ట్స్‌లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది.

'Geetha Govindam' Pre-release

ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విషయానికొస్తే.. ఈ నెల 12వ తేదీన నిర్వహించడానికి సిద్ధమౌతున్నారు చిత్ర యూనిట్‌. ఈ ఈవెంట్‌ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్ సి.ఆర్. రెడ్డి కాన్వొకేషన్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభమౌతుంది.

పోస్టర్స్ స్థాయి నుంచే ఈ సినిమా యూత్‌ను తన వైపుకు తిప్పుకుంది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో భారీ హిట్ చేరనుందనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.