రేపటి నుండి శ్రీవారి మహాసంప్రోక్షణ

476
ttd
- Advertisement -

కళియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపటి నుండే(11న)మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుండటంతోయాగశాల లో హోమాలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

11వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీవారి మహాసంప్రోక్షణ జరగనుంది.ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి రోజు లక్ష మంది భక్తులు వస్తుండగా సంప్రోక్షణ సమయంలో కేవలం 20 వేల నుంచి 30 వేల మందికి మాత్రమే అనుమతివ్వనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అంతకముందు టీడీపీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల 11 నుంచి 17 వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. భక్తులు,ధార్మిక సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీటీడీ పాలకమండలి వెనక్కి తగ్గింది. మహాసంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శన విధివిధానాలను విడుదల చేస్తూ భక్తులకు పలు సూచనలు చేసింది.

- Advertisement -