సెప్టెంబర్‌లో అమీర్‌పేట్-ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం

240
ktr kamineni flyover
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా రావాణ వ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌లోని కామినేని జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్ మెగా సిటీగా అవతరించిందన్నారు.

రూ. 23 వేల కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రేటర్‌లో 32 నుంచి 35 శాతం ప్రజలు మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించు కుంటున్నారని … మిగతా 65 శాతం మంది సొంత వాహనాలను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.

అమీర్‌పేట్ – ఎల్బీనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు పొడిగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రూ. 100 కోట్లతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడితేనే ట్రాఫిక్ సమస్యను అధిగమించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -