- Advertisement -
వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా నాలుగోసారి తగ్గుముఖం పట్టాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ఒక్కో దానిపై రూ. 30 వరకు తగ్గింది. తగ్గిన ధరలు జులై 1 ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1646గా ఉండగా కోల్‌కతాలో రూ. 1756 గా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 1598గా ఉంది. హైదరాబాద్‌లో రూ. 31 తగ్గి గ్యాస్ సిలిండర్ ధర రూ. 1872.50 కి చేరింది. నాలుగో నెల కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గాయి.
ఇక 14.2 కిలోల గృహ వినియోగ వంటగ్యాస్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇది దేశ రాజధాని ఢిల్లీలో రూ. 803గా ఉండగా కోల్‌కతాలో రూ. 829 ,హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ రేటు రూ. 855 వద్ద ఉంది.
Also Read:NEET UG:రీఎగ్జామ్.. ఫలితాలు విడుదల
- Advertisement -