బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత్ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సంజూ. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈసినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. దాదాపు ఈమూవీ 500కోట్ల కలెక్షన్లను రాబట్టి బాక్సాఫిస్ రికార్డును తిరగరాసింది. అయితే ఈసినిమాకు పలువురి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది. తాజాగా సంజూ మూవీపై మరో కేసు నమోదైంది. మాఫియా డాన్ అబూ సలేం లీగల్ నోటిసులు పంపించారు.
అబూసలేం తరపు న్యాయవాది ప్రశాంత్ పాండే ద్వారా సంజూ మూవీ నిర్మాతలకు నోటిసులు పంపించారు. ఈసినిమాలో కోన్ని సీన్లలో తనను తప్పుగా చూపించారంటూ నోటిసులు పంపించారు. సంజూ సినిమాలోనుంచి 15 రోజుల్లో ఆసీన్లను తొలగించకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 1993వ సంవత్సరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో సంజయ్ దత్‌కి.. అబూ సలేం ఆయుధాలు, మందుగుడు సామాగ్రి సరఫరా చేసినట్టు సినిమాలో చూపించారనన్నారు.
అబూసలేం అసలు ఒక్కసారి కూడా సంజయ్ దత్ ని కలవలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈసినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వం వహించగా సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ నటించగా..ఆయన ప్రియురాలి పాత్రలో సోనమ్ కపూర్ నటించారు. ఇక అబూసలేం పంపించిన నోటిసులకు సంజూ చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందింస్తారో చూడాలి.