స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ తో మెగా హీరో…

336
varun tej, trinad rao nakkina

ద‌ర్శ‌కుడు త్రినాథ రావు నక్కిన నేను లోకల్ సినిమాతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్తామామ వంటి హిట్ సినిమాలు తీసి హిట్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం హీరో రామ్ తో హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాను చేస్తున్నాడు. ఈమూవీలో రామ్ స‌ర‌స‌న హీరోయిన్ గా మ‌ల‌యాళి భామ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. ఈచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

trinadha-rao-nakkina

ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఈసినిమా త‌ర్వాత త్రినాధ్ రావు న‌క్కిన మెగా హీరోతో చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. హీరో వ‌రుణ్ తేజ్ ఇటివ‌లే క‌థ వినిపించాడ‌ని..క‌థ న‌చ్చ‌డంతోవ‌రుణ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తుంది.

త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం ఎఫ్ 2 అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తుండ‌గా..దానితో పాటు యువ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి తో ఓ సినిమాను చేస్తున్నాడు. సంక‌త్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా త్వ‌ర‌లోనే పూర్తి కానుంద‌ని ఆ త‌ర్వాత ఈసినిమాను ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈసినిమాను నిర్మించ‌నున్నారు.