కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన గండ్ర‌…

156
KTR

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి,గండ్ర జ్యోత‌తి. జిల్లా కాంగ్రెస్ అద్యక్ష ప‌దవితో పాటు పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు కేటీఆర్ ని క‌లిసిన గండ్ర దంప‌తులు పార్టీలో చేరిక‌పై సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా పీసీసీచీఫ్ ఉత్త‌మ్ క‌మార్ రెడ్డికి లేఖ రాసిన గండ్ర జ్యోతి త‌న‌కు రాజ‌కీయంగా అవ‌కాశం క‌ల్పించిన సోనియాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

గండ్ర టీఆర్ఎస్‌లో చేరబోతున్నార‌ని రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌…గండ్ర‌తో భేటీ అయి భుజ్జగించే ప్ర‌య‌త్నం చేశారు.కానీ అవేవి ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు కారెక్కేందుకే మొగ్గుచూపిన గండ్ర …కేటీఆర్‌తో భేటీ కావ‌డం,కాంగ్రెస్ కు రాజీనామా చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.