పాడరా…పాడరా అంటూ వస్తున్న మహర్షి..

281
Maharshi padara padara song

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఉగాది కానుకగా విడుదల కాగా తాజాగా మరో సాంగ్‌ని ఈ నెల 24న విడుదల చేయనున్నారు. పాడరా పాడరా అంటూ సాగే సాంగ్ 24న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రైతు నేపథ్యంలో ఈ సాంగ్‌ సాగనున్నట్లు పోస్టర్‌ని చూస్తే తెలుస్తోంది.

ఉగాది కానుకగా విడుదలైన టీజర్‌ ఆల్‌ టైమ్ రికార్డులను సృష్టించింది. 24 గంటల్లోనే 12.6 మిలియన్‌ రియల్‌ టైమ్‌ వ్యూస్‌ సాధించి సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్ కాగా సెకండ్ సింగిల్‌ ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేైసెయ్ మిసైలులా… అంటూ శ్రీమణి రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో వేచిచూడాలి.