సరికొత్త చరిత్ర లిఖించాం:ట్రంప్

198
trump

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన భేటీ అనంతరం పలు కీలక పత్రాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన యుద్ధం ఎవరైనా చేస్తారు కానీ సాహసం ఉన్నవారే శాంతి చర్చలు చేపడతారని తెలిపారు. కిమ్‌తో చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కిమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిన్నటి ఉద్రిక్త పరిస్ధితులు రేపటి యుద్దానికి దారి తీయకూడదని తెలిపారు. సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధంగా ఉన్నామని…క్షీపణి ప్రయోగ కేంద్రాలన్ని ధ్వంసం చేస్తానని కిమ్‌ హామీ ఇచ్చారాన్నారు. ఉభయ కొరియా ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. వీలైనంత త్వరలో అణునిరాయుధికరణపై సంతకాలు చేస్తామన్నారు. మార్పు సాధ్యమేనని నిరూపించామన్నారు ట్రంప్.

  trump kim

ఇది ఓ చారిత్రక సమావేశం…గతాన్ని వదిలిపెట్టాలని ఇరు దేశాధినేతలం నిర్ణయించామని తెలిపారు కిమ్ జోంగ్ ఉన్‌. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్‌ను వైట్‌హౌస్‌‌కు ఆహ్వానిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడగగా.. తప్పకుండా.. అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. కిమ్ చాలా స్మార్ట్‌, విలువైన వ్యక్తి అని ట్రంప్‌ కొనియాడారు.