హీరో పదానికి నేను సరిపోను…

224
- Advertisement -

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం జంబ లకిడి పంబ. ఒకవైపు స్టార్ హీరోలతో కలిసి నవ్వులు పూయిస్తూనే… మరోవైపు విభిన్నమైన కథలతో కథానాయికుడిగా మంచి గుర్తింపు ఏర్పర్చుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబ లకిడి పంబ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

Actor Srinivas Says Im Not Sutable Hero Word

తాజాగా ఓ ఇంటర్వూలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. హీరో గురించి ప్రస్తవించగా.. హీరో అంటే ఒక రేంజ్ ఉండాలని, ఆయన పోస్టర్ పడిందంటే ప్రేక్షకులు థియేటర్ ముందు క్యూలో నిల్చోవాలని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే హీరో అనే పదానికి తాను సరిపోను అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరో సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుందా..! అని అభిమానులు ఎదురు చూడాలి. కానీ ఈ శ్రీనివాస్ రెడ్డి సినిమా కోసం ఎవరూ ఎదురు చూడరు, ఆలోంచరు.

అందుకే కమెడియన్ గా చేస్తూనే… హీరోగా చేస్తూ ముందుకు పోతున్నానని చెప్పారు. ఈ జంబ లకిడి పంబ సినిమాకి మురళీకృష్ణ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, పోసాని మురళీకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శ్రీనివాస్ రెడ్డి. ఈసారి జంబ లకిడి పంబ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

- Advertisement -