ఫ్రంట్‌లైన్‌ కాంబాట్‌గా శైలజ ధామి…

242
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మహిళలు నేరుగా యుద్ధ క్షేత్రంలో విధులు నిర్వర్తించే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో ఆర్మీ, నేవీ రంగాల్లో నిలిచారు. ఈ నిర్ణయంతో వాయురంగంలో కూడా మహిళలు నిలిచారు. గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామికి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్‌ కాంబాట్‌ యూనిట్‌లో కమాండ్ బాధ్యతలు అప్పగించింది. రణరంగంలో నాయకత్వ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇదే తొలిసారి.

2003లో హెలికాప్టర్ పైలట్‌గా భారత వాయుసేనలోకి అడుగుపెట్టారు. ఆమెకు 2,800గంటలు హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉంది. పశ్చిమ సెక్టార్‌లో హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్‌ కమాండర్‌గా వ్యవహరించనున్నారు. వాయుసేనలో గ్రూప్ కెప్టెన్‌ అంటే ఆర్మీలో కల్నల్‌తో సమానం. శైలజ ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

అన్ని రంగాల్లో స్త్రీ అభివృద్ధే..దేశాభివృద్ధి: సీఎం

పెట్టుబడుల స్వర్గధామం..మళ్లీ మేమే వస్తాం…

బీజేపీలో కిషన్ పెట్టిన మంట !

- Advertisement -