శాంతి చర్చలు చేద్దాం:పాక్ ప్రధాని

299
imran khan
- Advertisement -

భారత్‌తో తాము శాంతి చర్చలు కోరుకుంటున్నామని స్పష్టం చేశారు పాక్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్‌. ఒక్కసారి యుద్ధం మొదలైతే అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరికి తెలియదన్నారు. పాక్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్‌ పుల్వామా దాడి తర్వాత భారత్ ఎంత బాధపడిందో తాము అర్ధం చేసుకోగలమన్నారు.

పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. గత పదేళ్లలో నేను ఎన్నో ఆస్పత్రులకు వెళ్లి బాంబు దాడి కారణంగా గాయపడిన వారిని కలుసుకున్నాను. బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణగాలంటే అందుకు శాంతిపూర్వక చర్చలే సమాధానమని సూచించారు.సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు. సావధానంగా కూర్చొని చర్చించుకుందామన్నారు. భారత్‌ను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు.

- Advertisement -