ఈ దేశాల్లో మళ్లీ లాక్ డౌన్‌!

249
lockdown
- Advertisement -

చలికాలం ప్రారంభంకావడంతో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఎక్కడ విన్ని రీ లాక్ డౌన్‌ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీలలో చలికాలం ముందుగానే కరోనా కేసులు మళ్లీ తీవ్రంగా పెరగడంతో తిరిగి లాక్‌డౌన్‌ను ప్రారంభించాయి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రోన్‌, జర్మన్ చాన్సెలర్ ఏంజెలా మార్కెల్ వారి దేశాలలో ప్రకటించారు.

ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, కుదిరితే వర్క్ ఫ్రం హోమ్ చేయాలనీ, కేవలం అత్యవసర, నిత్యవసర వస్తువులకు మాత్రమే బయటకు రావాలని ఫ్రాన్స్ ప్రజలను మాక్రోన్ కోరారు. కరోనా నుంచి తప్పించుకునేందుకు లాక్‌డౌన్ ఓ మంచి పరిష్కారమని మాక్రోన్ తెలిపారు.దేశంలో లాక్‌డౌన్ 30 రోజులు కొనసాగుతుందని వెల్లడించారు.

జర్మనీలో నవంబర్ 2 నుంచి 30 వరకూ లాక్‌డౌన్‌లో భాగంగా అన్నీ మూసివేయాలనీ, స్కూళ్లు, మార్కెట్‌లను మినహాయించినట్లు మార్కెల్ తెలిపారు. ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనాకు సులువుగా అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

- Advertisement -