రాష్ట్రంలో 24 గంటల్లో 1445 కరోనా కేసులు..

37
covid 19

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,445 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,38,632కు చేరాయి.

ఇప్పటి వరకు 2,18,887 మంది కరోనా నుండి కోలుకోగా 1,336 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,409 యాక్టివ్ కేసులుండగా 15,439 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతంగా ఉంది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.3 శాతంగా ఉంటే… రాష్ట్రంలో 91.72 శాతానికి పెరిగిందని ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.