వరంగల్ అర్బన్ కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందన..

174
ktr
- Advertisement -

వరంగల్ పట్టణంలో అక్రమ నాలాల కూల్చివేతపై బాగా పనిచేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు అభినందలు తెలిపారు మంత్రి కేటీఆర్.ప‌ట్ట‌ణంలో నాలాలు, డ్రైన్ల‌కు ఉన్న అడ్డంకులు తొల‌గించేందుకు బాగా ప‌ని చేశార‌ని కొనియాడారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప‌ట్ట‌ణాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుస‌రించాల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో మొత్తం 384 అక్ర‌మ‌ నిర్మాణాలను గుర్తించారు. వీటిలో 288 అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేశారు. మ‌రో 96 నిర్మాణాలు కోర్టు స్టేతో పెండింగ్‌లో ఉన్నాయి.

- Advertisement -