గంగూలీ తెలివైనవాడు: షోయబ్ అక్తర్

513
shoaib akthar
- Advertisement -

టెస్టు క్రికెట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని ఐసీసీ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని చాలామంది మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తుండగా తాజాగా పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా పెదవి విరిచాడు.

నాలుగు రోజుల టెస్టు అనేది ఓ చెత్త ఆలోచన…దానికి ఎవరూ ఆసక్తి చూపించరని చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఎంతో తెలివైనావడు…ఈ నిర్ణయాన్ని ఆయన ఎప్పటికీ జరగనివ్వడని చెప్పారు. దాదా టెస్టు క్రికెట్‌ని బతికిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

భారత్,పాకిస్ధాన్,శ్రీలంక నుంచి మరికొంతమంది ముందుకువచ్చి ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించాలన్నారు. ఇప్పటికే సచిన్,పాంటింగ్,మెక్ గ్రాత్,విరాట్ కోహ్లీ,టీమ్ ఫైన్,లైయన్ సంప్రదాయ క్రికెట్‌లో మార్పులు చేయకూడదని తేల్చిచెప్పారు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్తు పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది.

- Advertisement -