కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరంతరంగా రోగులకు సేవలు చేస్తున్న వైద్యులు, నర్సులకు సెల్యూట్ చేశారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. కరోనా వైరస్ తో యుద్దం చేస్తున్న వైద్య సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి వారికి సహకరించాలని కోరారు. కేరళలోని ఓ యువ వైద్యురాలు కరోనా పేషెంట్లకు వైద్యం చేయడానికి తన వివాహన్ని వాయిదా వేసుకుంది.
దుబాయ్ లో ఉండే ఓ బిజినెస్ మేన్ తో ఆమె వివాహం జరుగనుండగా కరోనా రోగులకు వైద్యం అందించేందుకు వివాహన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపింది.రోగుల క్షేమం కోసం తన వివాహన్ని వాయిదా వేసుకున్న ఈ యువ వైద్యురాలికి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.ఈ విషయాన్ని తన ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు మాజీ ఎంపీ కవిత. కాగా దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 1200మందికి పాజిటివ్ రాగా 50మంది మరణించారు.