శ్రియా ‘గ‌మ‌నం’ ఫ‌స్ట్ లుక్..

212
Shriya Saran

టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియా శ‌ర‌ణ్‌ గత రెండు ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ అమ్మడు చాలా కాలం తర్వాత మళ్లీ వెండి తెరపై కనువిందు చేయబోతుంది. సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. శ్రియా శ‌ర‌ణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నేడు ‘గ‌మ‌నం’ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రియ సాధారణ మధ్యతరగతి గృహిణి పాత్రలో అలరించనున్నట్టు ఈ పోస్టర్ చూస్తూ చెప్పొచ్చు.ఈ పోస్టర్‌లో శ్రియ లుక్ చూస్తుంటే.. దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా ఉంది.

ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పని నడుస్తోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.